Ganesh Chaturthi: వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలపై ఏపీ సర్కారుకి Pawan Kalyan ప్రశ్నలు

Vinayaka chavithi celebrations in AP: వినాయక చవితి వేడుకల విషయంలో ఏపీ సర్కారు ఆంక్షలు విధించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2021, 11:59 PM IST
Ganesh Chaturthi: వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలపై ఏపీ సర్కారుకి Pawan Kalyan ప్రశ్నలు

Vinayaka chavithi celebrations in AP: వినాయక చవితి వేడుకల విషయంలో ఏపీ సర్కారు ఆంక్షలు విధించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. వైసీపీ నేతల కార్యక్రమాలకు కరోనావైరస్ నిబంధనలు అడ్డురానప్పుడు వినాయక చవితి ఉత్సవాలకు మాత్రం కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు ఎలా వర్తింపజేస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ సంస్మరణ సభకు కరోనా లేదు కానీ విపక్షాలు ప్రభుత్వం తీరును నిరసిస్తూ ధర్నాలు చేస్తే కరోనా కేసులు పెడతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Also read : Vinayaka Chaturthi: సీఎం జగన్ పెళ్లి రోజు వేడుకలకు కరోనా అడ్డం రాలేదా: నారా లోకేష్

ఇదిలావుంటే పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లినట్టు జనసేన పార్టీ వర్గాలు (Janasena party) తెలిపారియ. ఢిల్లీలో ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన అనంతరం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలను కలిశారు.

Also read : AP Corona Update: ఏపీలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు, 24 గంటల్లో కేవలం 739 కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News